విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ బూత్‌లకు అనుమతినిచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు వెయ్యి మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి రెండు రోజుల పాటు టీకాల పంపిణీ చేయనున్నట్లు జిల్లా పాలనధికారి వెల్లడించారు. జిల్లాలో మొదటిసారి కోవాగ్జిన్ టీకాను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం ఐదు వ్యాక్సినేషన్ బూత్‌లను ఏర్పాటు చేశామని.. హాస్పిటల్స్ ఛైర్మన్ డా.పి వి రామారావు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తొలి విడత వ్యాక్సినేషన్.. మెుదటి టీకా ఆమెకే!