విజయవాడ అజిత్ నగర్ పరిధిలోని సుందరయ్య నగర్ కరకట్ట వెంబడి జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. పునాది కోసం సుమారు పది అడుగుల మేర గొయ్యి తీస్తుండగా ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు మట్టిలోకి పోవడంతో బయటకురాలేని పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతన్ని కాపాడారు. బాధితుడు విజయవాడ గ్రామీణ మండలం అంబాపురానికి చెందిన విజయ్ కుమార్‌గా తోటి కార్మికులు చెప్పారు.
ఇదీ చదవండి.. Jungle Cat Died: రోడ్డు ప్రమాదంలో అడవి పిల్లి మృతి