ETV Bharat / city

Fire Accident: సికింద్రాబాద్​లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

fire accident
fire accident
author img

By

Published : Mar 23, 2022, 7:07 AM IST

Updated : Mar 23, 2022, 10:41 AM IST

07:05 March 23

టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం

టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం

Fire Accident at Boyaguda : బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చారు. కానీ వాళ్ల బతుకులు బుగ్గిపాలవుతాయని ఊహించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించారు. ఇలా ఓ ప్రమాదం వారి శ్రమతో పాటు వాళ్లను కూడా బూడిద చేసి.. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అనుకోలేదు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం ఎండనక.. వాననక కష్టపడ్డారు. కానీ వారితో పాటు వారి పిల్లల జీవితాలు కూడా అగ్గిలో బూడిదవుతాయని ఆలోచించలేకపోయారు. రాత్రంతా కష్టపడి.. రేపటి మీద ఆశతో.. రెట్టింపు కష్టపడాలని ఆలోచిస్తూ.. జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయిన వాళ్లంతా.. అదే వారికి ఆఖరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయారు. తెల్లవారుజామున తెలంగాణలోని సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు అక్కడికక్కడే బూడిదయ్యారు.

Fire Accident in Timber Depot : సికింద్రాబాద్ బోయగూడలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో టింబర్‌ డిపోలో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. కొందరు సజీవదహనం కాగా పొగతో ఊపిరాడక మరికొందరు మృతి చెందినట్లు వెల్లడించింది. మంటల నుంచి సురక్షితంగా ఇద్దరు కార్మికులు బయటపడ్డారు. మృతులంతా బిహార్​కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు..

Boyaguda Fire Accident : స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉండటం వల్ల టింబర్ డిపో నుంచి మంటలు స్క్రాప్ గోదాముకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

గుర్తుపట్టలేనంత కాలిపోయాయి..

Boyaguda Fire Accident News : 11 మంది మృతదేహాలు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆస్పత్రి వద్ద అదనపు బలగాలతో పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. అగ్నిప్రమాద మృతుల్లో ఇద్దరు మినహా మిగతా వాళ్లు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని చెప్పారు.

మృతులంతా యువకులే..

మృతులు సికిందర్‌‍‌(40), బిట్టు(23), సత్యేందర్‌(35), గోలు(28), దామోదర్‌‍‌(27), రాజేశ్‌‍‌(25), దినేశ్‌(35), రాజేశ్‌(25), చింటు(27), దీపక్‌(26), పంకజ్‌(26)గా గుర్తింపు.

బాధిత కుటుంబాలకు మంత్రి తలసాని భరోసా..

Boyaguda Fire Accident Updates : అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు పోలీసులను ఆదేశించినట్లు తలసాని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా కల్పించారు.

ప్రమాదస్థలిని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌తో పాటు సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందోనని ఆరా తీశారు. ఘటనపై వీలైంత త్వరగా విచారణ చేసి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.

"సమాచారం అందగానే అధికారులు స్పందించారు. కింద ఫ్లోర్‌లో తుక్కు సామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. గోదాముకు ఎలాంటి అనుమతులు లేవు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదు. గోదాంలో ప్రమాద నివారణ చర్యలు ఏమీ లేవు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం."

- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

ఇదీ చదవండి:

కేంద్రం తీరుపై అమరావతి రైతుల అసంతృప్తి... దిల్లీకి వెళ్లనున్న ఐకాస బృందం

Last Updated : Mar 23, 2022, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.