కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయని..దీనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉందని.. మన రాష్ట్రమేమీ మినహాయింపు కాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దీనిపై విపక్షాలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం తగదన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో దిల్లీలో ఆయన భేటీ అయ్యారు. పోలవరం ప్రాజక్ట్ సవరించిన అంచానాల ఆమోదం, రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల పెండింగ్ నిధులపై చర్చించినట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నట్లు బుగ్గన చెప్పారు. ఇందుకయ్యే ఖర్చుంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని..అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిత్యావసరాలకు రాష్ట్రం కూడా తన వాటా జోడించి సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో అందరికంటే మిన్నగా..పేద, మధ్యతరగతి వారికి నిత్యావసరాలు ఇంటింటికి అందించినట్లు వివరించారు.
ఇదీచదవండి