teachers protest: ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. దశలవారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని ఫ్యాప్టో హెచ్చరించింది. ఈ నెల 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భోగి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల కమిటీ పీఆర్సీ నివేదికను మంటల్లో వేసి ఫ్యాప్టో నాయకులు నిరసన తెలిపారు. జీతాలు తగ్గిపోయేలా ఫిట్ మెంట్ , హెఆర్ఏ ప్రతిపాదించడం దారుణమన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.
భోగి మంటల్లో పీఆర్సీ నివేదిక ప్రతులు
కృష్ణాజిల్లా గుడివాడలో పీఆర్సీపై అధికారుల కమిటీ సిఫార్సుల నివేదిక ప్రతులను, ఉపాధ్యాయులు భోగిమంటల్లో దగ్ధం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగే సిఫార్సులను రద్దు చేయాలంటూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భోగిమంటల వద్ద ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలు తగ్గిపోయే విధంగా ఫిట్మెంట్, హెచ్ఆర్ఏల విషయంలో అసంబద్ధమైన, అన్యాయమైన సిఫార్సులను అధికారుల కమిటీ రూపొందించడం దారుణమని ఫ్యాప్టో నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: YSRCP Clases: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు