అత్యాధునిక ఎండోవాస్క్యులర్ చికిత్సల కోసం అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వైద్య కేంద్రంతో విజయవాడలోని రమేశ్ ఆస్పత్రి ఒప్పందం చేసుకుంది. ఆపరేషన్‌ల కంటే మందుల ద్వారానే చికిత్స చేయడం దీని ముఖ్య ఉద్దేశమని వాస్యులర్, ఎండోవాస్క్యులర్ వైద్యుడు కార్తిక్ మిక్కినేని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాళ్లు తీసే పరిస్థితి రాకుండా అత్యాధునిక సాంకేతికతో చికిత్స అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నారు.
ఎంతో సంక్లిష్టమైన అయోటిక్ అన్యూరిజం, డిసెక్షన్, శరీర ముఖ్యభాగాల్లో రక్త ప్రసారంలో గడ్డ కట్టడంలను సూది రంధ్రం ద్వారా నయం చేయవచ్చని చెబుతున్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, రేడియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జన్లతో కూడిన ప్రత్యేకమైన విభాగాన్ని సమగ్ర సేవలు అందించడానికి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే'