వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీకి ఆ పేరు పెట్టడం వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌తోపాటు అనేక మంది మహనీయులు కృష్ణా జిల్లాలో జన్మించినా.. ఆ పేర్లు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. ఏ హక్కుతో తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టారని నిలదీశారు.
సీఎం జగన్ మెప్పు కోసమే అవినీతిపరుడైన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టించారని బోడె ప్రసాద్ విమర్శించారు. ఆ పేరు మార్చే వరకు తెదేపా పోరాటం చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: