"విశాఖ రామానాయుడు స్టూడియో(Rama naidu studio)పై కన్నేసిన జగన్ రెడ్డి... ఆ కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు" అని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru sathyanarayana) ఆరోపించారు. ఇందుకు విజయసాయిరెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని మరో ఆరోపణ చేశారు. రామానాయుడు స్టూడియోను కబ్జా చేసేందుకు అనుకూలంగా లేడన్న కారణంతోనే అదనపు కమిషనర్‌ను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు.
2002లో చంద్రబాబు హయాంలో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 34.44 ఎకరాలను కేటాయించగా 2008లో స్టూడియో నిర్మాణం పూర్తయిందని బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోని వచ్చాక విశాఖను నాశనం చేస్తున్నారని... ఇప్పటికే పలు భూములను కబ్జా చేశారని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో జిల్లాలో 600 ఎకరాల భూమిని దోచుకున్నారని మండిపడ్డారు. అరబిందో భూముల ధరలు పెంచేందుకే విశాఖ బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
ఐఆర్ఎస్ అధికారి సుందర్ సింగ్ నివాసాల్లో సీబీఐ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు!