ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. దుర్గ గుడి ఈవో సురేశ్...ఆలయ మర్యాదలతో చినజీయర్ స్వామిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనదని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి ప్రజలు కష్టాలు పడుతున్నారు. కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచదేశాల్లో తీవ్ర ప్రయత్నాలు. భారత్‌లోనూ వ్యాక్సిన్‌పై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా. వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి మళ్లీ శక్తిమంతులవుతారు. భారత్ తిరిగి శక్తిమంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా." అని చినజీయర్‌స్వామి వెల్లడించారు.
ఇదీచదవండి
వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం