నెల్లూరు జిల్లాలో...
నెల్లూరులో పేర్నాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో హోంగార్డులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రస్ట్ తరఫున పేదలకు సహాయం చేస్తున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో ...
అనంతపురంలో వెంకట్ చౌదరి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాకేష్ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరకులను అందించారు. నిత్య సురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూలీల ఇబ్బందులు చూసి స్థానిక యువకులు చందాలు వేసుకొని 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
విజయనగరం జిల్లాలో...
భోగాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వైద్య, పోలీస్, మీడియా, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందించారు.
విశాఖపట్నం జిల్లాలో...
చోడవరంలో పతంజలి యోగా శిక్షణ కేంద్రం అధ్వర్యంలో సంచార జాతులకు బియ్యం, నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.
కడప జిల్లాలో...
కడపలోని కృష్ణ కూడలిలో 400 మంది ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. పన్నెండు రకాల వస్తువులతో పాటు ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున ఇచ్చారు. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: