ETV Bharat / city

కష్టకాలంలో కదిలొచ్చిన దాతలు - lockdown latest news

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ కార్యక్రమం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రోజు వారి పనులు చేసుకునే పేదవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. దాతృత్వం చాటుకుంటున్నారు.

కష్టకాలంలో కదిలొచ్చిన దాతలు
కష్టకాలంలో కదిలొచ్చిన దాతలు
author img

By

Published : Apr 7, 2020, 5:02 PM IST

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన కారణంగా.. ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో మాజీ ఎంపీపీ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

కృష్ణా జిల్లా చండ్రగూడెంలో స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలకు హోమియో మందులు, మాస్కులను జనసైనికులు అందజేశారు. మొదటగా కరోనా తీవ్రతరం చెందకుండా పత్తి సాయి దాశరథి నిర్వహిస్తున్న పీడా నివారణ యోగం వద్ద ఈ పంపిణీ వస్తువులకు సంప్రోక్షణ చేయించారు. అనంతరం స్థానికులకు అందించినట్లు జనసేన నాయకుడు శీలం బ్రమ్మయ్య తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు దేశమంతా రుణపడి ఉంది

విజయవాడ పటమటలంకలోని మహిళలు తమ వంతు సాయంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు 5 కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి భయం కలిగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జాతి ఎంతో రుణపడి ఉంటుందని మాజీ మేయర్‌ రత్నబిందు పేర్కొన్నారు. మహిళా కార్మికులకు నిత్యావసర సరుకులు ఇబ్బంది లేకుండా ప్రజలంతా తమ వంతు సహాయంగా ఆదుకోవాలని కోరారు.

ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ

రాష్ట్రంలో లాక్​డౌన్ కొనసాగుతున్న​ నేపథ్యంలో పేద ప్రజలకు మాజీ కార్పొరేటర్ లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందించారు. అనంతపురంలోని 45వ డివిజన్ పరిధిలో పేద ప్రజలకు కూరగాయలు, కోడిగుడ్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కొనసాగితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.

భోజనం పంపిణీ చేస్తున్న ఓం శివశక్తి పీఠం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ 'ఓం శివశక్తి పీఠం' స్థాపకులు బలరామ కృష్ణ.. తమ పీఠం వద్ద హెల్ప్​లైన్ ఏర్పాటు చేశారు. లాక్​డౌన్​ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదవారికి చేయూతనిస్తున్నారు. రోజూ 1000 మందికి పైగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు పీఠాధిపతి బలరామ కృష్ణ తెలిపారు.

వాలంటీర్లకు నిత్యావసరాలు పంపిణీ

గ్రామాల్లో వాలంటీర్లు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచనీయమని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండల పరిధిలో వాలంటీర్లు చేస్తున్న కృషికి అభినందించి వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు.

3 వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని కుమారపురం, కందిపూడి, రాజగోపాలపురం తదితర గ్రామాల్లో... సుమారు 3 వేల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దుర్గా దేవి ఆలయ ధర్మకర్త తన సొంత నిధులతో కూరగాయలు కొనగోలు చేసి ఇంటింటికీ వెళ్లి అందించారు.

పేదలకు అండగా మాజీ ఎమ్మెల్యే

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పేదలకు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే​ బండారు సత్యానందరావు తమ వంతు సాయం అందించారు. కొత్తపేట మండలంలోని వాడపాలెంలో రెండు వేల మందికి నిత్యావసర సరుకులను ఇంటింటికి వెళ్లి అందించారు.

20 టన్నుల పుచ్చకాయలు పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో పుచ్చకాయలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల శ్రీనివాస్, రాజేశ్వరి దంపతుల ఆర్థిక సాయంతో సమకూర్చిన 20 టన్నుల పుచ్చకాయలను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా గ్రామస్థులకు అందించారు.

మహిళా కార్మికులకు సహాయం

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 'వుడ్ అండ్ కట్లర్' చెక్క నగషీ కేంద్రంలో పనిచేసే మహిళా కార్మికులకు కేంద్రం నిర్వాహకులు గౌసియా బేగం, జాకీర్ హుస్సేన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తహసీల్దార్​ బీమా ప్రసాద్, ఎంపీడీవో వీరస్వామి వాటిని అందించారు.

రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ చేయూత

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటను రెడ్​జోన్​గా ప్రకటించగా.. ఆ ప్రాంతవాసులకు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నిత్యావసర సరుకులను అందించారు. సుమారు 1200 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులను ఇంటింటికి పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

పారిశుద్ధ్య కార్మికులకు అండగా 'ప్రగతి భారత్ ఫౌండేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.