తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్...హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నరసింహన్‌కు...దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పలువురు అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర 16వ ప్రత్యేక దళ గౌరవ వందనాన్ని గవర్నర్ నరసింహన్ స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న నరసింహన్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, పండితులు ఆహ్వానం పలికారు. ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించడం వల్ల... నరసింహన్ ఏపీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇవాళ గవర్నర్ నరసింహన్‌కు ప్రభుత్వం వీడ్కోలు పలకనుంది.
ఇదీ చదవండి : ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ కష్టాలు ఇకనైనా తీరేనా..!