తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల చేస్తున్న నీటితోపాటు.. ఎగువన కురుస్తున్న వర్షాలతో చేరుతున్న వరద కారణంగా... ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage)లో పూర్తిస్థాయికి నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ చర్య జాలర్లకు వరంగా మారింది. బ్యారేజీ గేట్ల ద్వారా నీరు దిగువకు వెళ్తుండటంతో నీటి ప్రవాహానికి చేపలు ఎగువకు వస్తున్నాయి. దీంతో జాలర్లు బోట్లు ఉపయోగించకుండానే చేపల్ని పట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు ఆనందిస్తున్నారు.
నీరు విడుదల మేలే చేసింది
నదిలోకి వెళ్లి పట్టాలంటే ఎక్కువ శ్రమతోపాటు, ఖర్చుతో కూడుకుంది అంటున్నారు. నదిలోకి వెళ్లినప్పుడు ఒక్కోసారి ఆ రోజు కూలి గిట్టుబాటు అయ్యే చాపలు కూడా వలలకు చిక్కని పరిస్థితి ఉంటుందని.. నదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా ఒక్కోసారి ఖాళీ చేతులతో వస్తుంటామని చెప్పారు. ప్రస్తుతం నీటి విడుదలతో తమకు మేలే చేకూరిందని, సులభంగా చేపల్ని పట్టుకొని విక్రయిస్తున్నామని అన్నారు.
బెడిసెకు అధిక గిరాకీ
నాలుగైదు రోజులుగా బ్యారేజీ దిగువ ప్రాంతంలో సులభంగా మంచి చేపలు పడుతున్నాయని.. కొన్ని 5 నుంచి 10 కేజీ వరకు ఉంటున్నాయన్నారు. రాగండి, చిత్రే, మూస చెప్ప, గొరస వాలగ రకాల చేపలు వలలకు చిక్కుతున్నాయని మత్స్యకారులు చెప్పారు. బెడిసె రుచికరంగా ఉండడంతో దాన్నే దాన్నే కోనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు.
కొత్త బోట్లు తీసుకెళ్తాం..
అటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదలోనూ చేపలు వస్తాయని జాలర్లు చెబుతున్నారు. వేటకు వెళ్లేప్పుడు ఏడాదో, రెండోళ్లకోసారి కొత్త బోట్లు తీసుకెళ్తామని.. తద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. అలాగే.. భారీగా స్థాయి చేపలు వలలకి చిక్కినప్పుడు వీటి ద్వారా ఒడ్డుకు తేవటానికి సులభంగా ఉంటుందన్నారు. బ్యారేజీ గేట్ల ఎత్తడం ద్వారా చేపలపైకి ఎక్కి వస్తున్నాయని.. సులభంగా ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: