Employees Union Leaders Meet With Ministers Committee: మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి భేటీ అసంపూర్తిగా సాగింది. మంత్రుల కమిటీతో భేటీపై పీఆర్సీ సాధన సమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. భేటీలో తమ అభిప్రాయాలు తెలిపినట్లు చెప్పారు. డిమాండ్లపై స్పందిస్తే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించినట్లు తెలిపారు.
తాము కూడా చర్చించుకుని మళ్లీ పిలుస్తామన్న మంత్రుల కమిటీ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ సూచించింది. మంత్రి బొత్స సత్యనారాయణ.. సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి..
Service Sector in Andhra Pradesh: రాష్ట్రంలో.. తిరోగమనంలో సేవల రంగం