ETV Bharat / city

టాలెంట్ ఉంటే చాలు.. "సాఫ్ట్" గా జాబ్ కొట్టేయొచ్చు! - ఇంజినీరింగ్​ కాలేజీల్లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలు

SOFTWARE JOBS: ప్రక్రియ పూర్తి స్థాయిలో మారుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలంటే.. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు చదివి ఉండాలనే విధానానికి భిన్నంగా.. ఏ బ్రాంచ్ చదివినా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. వివిధ కంపెనీలు.. బ్రాంచ్‌లను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ల్లోని సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ కోర్సులు చదువుతున్న వారూ.. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు.

SOFTWARE JOBS
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/04-March-2022/14635299_sft.png
author img

By

Published : Mar 4, 2022, 2:50 PM IST

SOFTWARE JOBS: సాఫ్ట్ వేర్‌ కంపెనీలకు మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దీంతో.. విద్యార్థుల నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మంచి ప్యాకేజీలు అందిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.

సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలకు నైపుణ్యాలు

SOFTWARE JOBS: విజయవాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అసెంచర్‌, టీసీఎస్​ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. వీరు ఏడాదికి 4.5 నుంచి 7.2 లక్షల రూపాయల మధ్య వేతన ప్యాకేజీలు పొందుతున్నారు. కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారూ ఉండటం గమనార్హం. మరో కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించారు. విశాఖపట్నంలోని మరో కళాశాలలో 168 మంది విద్యార్థులు.. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన మరో 14 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్‌ జెమిని, టీసీఎస్​, ఇన్ఫోసిస్‌ లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం విశేషం.

అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు..
SOFTWARE JOBS: స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు.. బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ను కరిక్యులమ్‌లో భాగం చేస్తున్నాయి. సివిల్‌, మెకానికల్‌, ట్రిపుల్ఈ విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, డాటా స్ట్రక్చర్స్‌, పైథాన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌పై శిక్షణ ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు స్వయం పోర్టల్‌లోని కోర్సులు పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం అందిస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు.

SOFTWARE JOBS: కరోనాతో వచ్చిన మార్పుల కారణంగా ఐటీ నియామకాలు పెరిగాయని.... ప్రాజెక్టులు అధికంగా రావడంతో కంపెనీలు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌పై అవగాహన ఉన్న వారిని తీసుకుంటున్నాయని ప్లేస్‌మెంట్ కన్సార్షియం అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. వాటిల్లో రైల్వే మంత్రి, రైల్వేబోర్డు ఛైర్మన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.