తమను ఇబ్బందులకు గురిచేసేలా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. పంచాయితీ ఎన్నికల దృష్ట్యా అధికారులు, ఉద్యోగులు.. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వచ్చి.. ఉద్యోగుల సమస్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు.
ఎన్నికల విధుల్లో గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలంటూ.. ఎస్ఈసీని ఉద్యోగ సంఘాల ఐకాస నేత వెంకటేశ్వర్లు కోరారు. అధికార, విపక్ష నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడేది అధికారులు, ఉద్యోగులేనన్నారు. రాజ్యాంగపరమైన ఎన్నికల విధులు నిర్వర్తించడమే తమ ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. ఉద్యోగులెవరైనా తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:
ఎస్‌ఈసీ మాటలు వినొద్దని సాక్షాత్తూ మంత్రి చెబుతారా?: వర్ల రామయ్య