రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కరోనా టీకాలు వేసేంత వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ వాయిదా వేయించాలంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను వినతిపత్రం అందజేసింది. రెవెన్యూ, అమరావతి ఉద్యోగ ఐకాస, పోలీసు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సంయుక్తంగా 7 పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ప్రస్తుతం టీకాల ప్రక్రియ మొదలైందని..రెండు డోస్‌లు పూర్తయ్యే వరకు ఎన్నికలు నిలిపివేయించాల్సిందిగా నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి