ETV Bharat / city

కలుషిత నీరే కారణం కావొచ్చు : ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా.రాజేష్ కక్కర్ - ఏలూరు బాధితుల నమూనాలు వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజల అస్వస్థతకు గల కారణాలు తెలుసుకోవటానికి మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం... రోగుల నమూనాలను సేకరించి దిల్లీ ఎయిమ్స్​కు పంపించారు. వైద్య పరీక్షల ఫలితాలు ప్రభుత్వానికి అందించనున్నట్లు... మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్​ డా. రాకేష్ కక్కర్ ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.

eluru victims samples were sent to delhi aiims for research
దిల్లీ ఎయిమ్స్​కు ఏలూరు బాధితుల నమూనాలు
author img

By

Published : Dec 8, 2020, 3:53 AM IST

Q:ఎలాంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు.?

జ: కళ్లు తిరగడం, మూర్ఛ లక్షణాలు బాధితులందరిలో కనిపించాయి. అందరూ చికిత్సకు స్పందిస్తున్నారు. అస్వస్థతకు కారణమేంటో గుర్తించి వాటి మూలాలను ధ్వంసం చేయాలి. అప్పుడే ఇకపై కేసులు రావు. ఇప్పటికే.. కొన్ని నమూనాలు సేకరించాం. రక్తం, నీరు, మూత్ర నమూనాలను దిల్లీ ఎయిమ్స్‌కు పంపించాం.

ఎంతమంది నమూనాలను సేకరించారు.

జ: 5 రకాల నమునాలను కొత్తగా చేరిన బాధితుల నుంచి సేకరించాం. కారణం కనుక్కునేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా...... నమూనాలను హైదరాబాద్‌కు పంపింది. ఈ వ్యాధిని అడ్డుకోవడమే మా అందరి ప్రయత్నం.

Q:ఏ కారణంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు.?

జ: పరీక్షించిన నమునాల ఫలితాలు రానంత వరకూ....... కచ్చితంగా అంచనా వేయలేం. నీళ్లూ కారణం కావచ్చు. కలుషిత నీళ్ల వల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. నమూనాల ఫలితాలు వస్తే..నీళ్ల వల్లనా.. లేక వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కారణమా తేలుతుంది.

Q: ఏవైనా లోహాలు కారణం అయ్యి ఉండవచ్చంటారా?

జ: క్లోరిన్ వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సీసం వల్ల కూడా ఇలా జరగవచ్చు. రైతులు ఉపయోగించే పురుగుల మందులు కూడా....... ఓ కారణం కావచ్చు. అయితే నివేదిక రాకుండా వీటిని నిర్ధరించలేం.

Q:ఆసుపత్రిలో చేరిన వారిలో ఎలాంటి లక్షణాలు గుర్తించారు?

జ: ఇప్పటివరకూ శ్వాసకు సంబంధించిన లక్షణాలు కనిపించ లేదు. ఎవరిలోనూ డయేరియా లేదు. మిగతా సమస్యలు ఏమీలేవు. నరాలకు సంబంధించి సమస్య కొంత కనిపిస్తోంది. అది కూడా అలా కనిపించి వెళ్లిపోతోంది. బాధితులంతా నిలకడగా ఉన్నారు. చికిత్సకు స్పందిస్తున్నందునా...... ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 350 కేసుల్లో కేవలం ఒకరు మాత్రమే చనిపోయారు. అది కూడా దీని వల్లే చనిపోయి ఉంటారని చెప్పలేం. ఇతర ఏవైనా కారణాలూ కావచ్చు.

Q:ఈ ఘటనపై ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇస్తున్నారా?

జ: ఎయిమ్స్‌ నిపుణులు నివేదిక రూపొందిస్తున్నారు. త్వరలోనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం.

ఇదీ చదవండి:

కోలుకోని ఏలూరు బాధితులు... తగ్గని మూర్ఛ లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.