పథకం ప్రకారమే తనపై దాడి జరుగుతోందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మెరుగైన సేవలందించే వైద్య ఆరోగ్యశాఖను తన నుంచి తప్పించారని, ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందని చెప్పారు. ఏ మంత్రినైనా తొలగించే అధికారం సైతం సీఎంకు ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వ్యక్తిగతంగా ప్రజలకు తోడుంటానని.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చర్యలను ప్రజలే అసహ్యించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈటల హెచ్చరించారు. వంద ఎకరాలు ఆక్రమించి షెడ్లు కట్టినట్లు చెబుతున్నారని, వాస్తవాలన్నీ బయటకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి ఈటల కోరారు. వ్యక్తిగతంగా ప్రజలకు తోడుంటానని తెలిపారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా హైదరాబాద్ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
తెలంగాణలో.. సీఎం కేసీఆర్ చేతికి వైద్య ఆరోగ్య శాఖ.. ఏ శాఖ లేని మంత్రిగా ఈటల!