రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 5వ రోజు సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇంద్ర కీలాద్రిపై శరన్నవరాత్రులు..
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజూ అమ్మవారు సరస్వతీ దేవీ రూపంలో ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ అమ్మవారు జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడం వల్ల వేద మంత్రోఛ్చరణల మధ్య లక్ష కుంకుమార్చన పూజను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్లు తీసుకున్న భక్తుల గోత్ర నామాలతో పరోక్ష విధానంలో అర్చకులే కుంకుమార్చన నిర్వహించారు. చండీహోమం, శ్రీ చక్ర వాహర్ణార్చనను అర్చక స్వాములు నియమ నిష్టలతో చేశారు. ఆలయంలో 6వ మహా మంటపంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించి మహా నివేదన చేశారు.
ప్రకాశం జిల్లాలో...
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజూ త్రిపురంతాకంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారు.. స్కందమత అలంకరణలో మయుర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యర్రగొండపాలెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ. అమ్మవార్లను దర్శించుకున్నారు.
విశాఖ జిల్లాలో
విశాఖ జిల్లాలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహాలను రోజుకో రూపంగా అలంకరిస్తున్నారు. నర్సీపట్నం దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు.. ఇవాళ సరస్వతి దేవి అలంకారతో భక్తులను దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కనుల పండుగగా సాగింది. దర్శన సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుడంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: