సమీపంలోని పోర్టులతో ఎదురవుతున్న పోటీ కారణంగా దుగరాజపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు లాభదాయకం కాదని...నీతి ఆయోగ్ తేల్చినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మనసుఖ్ ఎల్. మాండవ్య తెలిపారు. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు...ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. నీతి ఆయోగ్ సిఫార్సులను ఏపీ ప్రభుత్వానికి పంపి...రాష్ట్రంలో మేజర్ పోర్టు ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలు ప్రతిపాదించాలని కోరినట్లు తెలిపారు. ఈ మధ్యలో ఏపీలో మేజర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదలనపై అధ్యయనం చేసి...తదుపరి కార్యాచరణను సిఫార్సు చేయడానికి వీలుగా నౌకాయానశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కమిటీ కూడా ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని...అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ దుగరాజపట్నం స్థానంలో రామాయపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఆర్థిక సాయం కోరినట్లు చెప్పారు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టును..నాన్ మేజర్‌పోర్టుగా నోటిఫై చేసిందని గుర్తుచేశారు.
ఇదీచదవండి