దసరా పండుగ(Dussehra festival) సీజన్ దృష్ట్యా.. ప్రయాణికుల నుంచి టిక్కెట్ ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తే ఊరుకునేది లేదని కృష్ణా జిల్లా డీటీసీ ఎం.పురేంద్ర(DTC M.purendra) హెచ్చరించారు. రద్దీని అదనుగా తీసుకుని కొంతమంది ప్రైవేటు బస్సు యజమానులు టిక్కెట్ ధరకంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ధరలకు అనుగుణంగా బస్సు ఛార్జీలు నిర్ణయించాలని తెలిపారు. బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో ప్రైవేట్ బస్సు(private bus) ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు.
అబీబస్(abhi bus), రెడ్ బస్(red bus) వంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్(online ticket booking app) ఆధారంగా... టిక్కెట్ ధరలు ఎంత వసూళ్లు చేస్తున్నారో ప్రయాణికులను అడిగి తెలుసుకుంటామని పురేంద్ర అన్నారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు తేలితే కేసులు నమోదు చెయ్యడంతో పాటు బస్సులను సీజ్(seize) చేస్తామని హెచ్చరించారు. బాధిత ప్రయాణికులు వాట్సాప్ నం. 9154294106 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పొట్టిపాడు, గన్నవరం, రామవరప్పాడు, వారధి, ఇబ్రహీంపట్నం, కీసర, గరికపాడు, తిరువూరు, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో తనిఖీల కోసం 9 బృందాలు నియమించినట్లు డీటీసీ పురేంద్ర తెలిపారు.
ఇదీచదవండి.