సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి తాడేపల్లి చేరుకుంటున్న 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులను.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులను విజయవాడ, గుంటూరులో పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యను చెప్పుకునే అవకాశం పోలీసులు తమకు ఇవ్వటం లేదని వాపోయారు.
ఇదీ చదవండి: నేడు పోలవరం డంప్ యార్డ్‌ను పరిశీలించనున్న నిపుణుల కమిటీ