ETV Bharat / city

కష్ట కాలంలో విడిచిపెట్టం... ఆదుకుంటాం!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. ఫలితంగా ఎక్కడి ప్రజారవాణా అక్కడే నిలిచిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క పూట తినేందుకు నిత్యావసర వస్తువులు లేని పరిస్థితి. ఆ సమయంలో మేమున్నామంటూ ముందుకొస్తున్నారు పలువురు దాతలు. ఆకలితో అలమటిస్తున్న వారికి మూడు పూటల అన్నదానం చేస్తున్నారు. పలుచోట్ల ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టి దాతృత్వం చాటుకుంటున్నారు.

కష్ట కాలంలో విడిచిపెట్టం... ఆదుకుంటాం!
కష్ట కాలంలో విడిచిపెట్టం... ఆదుకుంటాం!
author img

By

Published : Apr 4, 2020, 9:05 PM IST

అన్నదానం చేసిన అంబులెన్సు డ్రైవర్లు
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని రోగులు, వారి బంధువులకు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు అన్నదానం చేశారు. లాక్​డౌన్​ కారణంగా ఆసుపత్రికి వచ్చిన రోగులు తిండి లేక ఇబ్బంది పడుతున్న తీరును చూసిన డ్రైవర్లు ఈరోజు వారందరికీ భోజనం పంపిణీ చేశారు.

Ambulance Drivers food distribution
అన్నదానం చేసిన అంబులెన్సు డ్రైవర్లు

ఉదారత చాటిన మాజీ సర్పంచ్​
లాక్​డౌన్​ కారణంగా పేద ప్రజల ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో ఓ మాజీ సర్పంచ్ స్వచ్ఛందంగా మూడు గిరిజన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం కొత్త గాంధీనగర్, పాత గాంధీనగరం, నడివీధి గ్రామాలలో గిరిజనులకు మాజీ సర్పంచ్ అయిన నిరంజని దేవి 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. తానే స్వయంగా కూరగాయల బస్తాలను భుజాన వేసుకుని కొండ కాలువలను దాటుతూ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు.

Former Sarpanch
ఉదారత చాటిన మాజీ సర్పంచ్​

వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా కృష్ణునిపాలెం మాజీ సర్పంచి కన్నబాబు కూరగాయలు పంపిణీ చేశారు. కృష్ణునిపాలెం, వెంకటాపురం, రామన్నపాలెం, చిన్నూరు, కొత్తూరు, సంజీవయ్యనగరం గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలకు కూరగాయలను అందించారు. స్థానిక తెదేపా నాయకులు, యువకులు ఆటోలపై ఇంటింటికి తిరిగి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

vegetables distribution
వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

అండగా నిలుస్తున్న దాతలు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెక్కాడితే గానీ డొక్కాడని వేల కుటుంబాల పేదలు గృహాలకే పరిమితమయ్యారు. వీరికి నిత్యావసర సరుకులు పంపిణీకి ఒకపక్క ప్రభుత్వం చేయూత నివ్వగా మరోవైపు దాతల నుంచి సహకారం అందుతోంది. ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నవారు, సొంత గ్రామాలలో స్థిరపడినవారు పేదవారికి అండగా నిలుస్తున్నారు.

food distribution
అండగా నిలుస్తున్న దాతలు

కార్మికుల ఆకలి తీరుస్తున్న చేగువేరా ఫౌండేషన్
లాక్​డౌన్​ కారణంగా పనిలేక ఆకలితో బాధపడుతున్న వలస కార్మికులకు తామున్నామంటూ ముందుకొచ్చారు చేగువేరా ఫౌండేషన్ సభ్యులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని రోజువారి కూలీల పరిస్థితి ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా పూట గడవడం కష్టంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి గూడూరు వచ్చి ఫ్యాక్టరీలలో పనిచేసే వలస కూలీలకు 14 రోజులపాటు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చేగువేరా పౌండేషన్ వ్యవస్థాపకుడు సురేష్ బాబు తెలిపారు.

Che Guevara Foundation food distribution

సబ్బులు, మాస్కులు పంపిణీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పలువురు దాతలు పేదలకు కూరగాయలు అందించేందుకు ముందుకొచ్చారు. పట్టణంలో మాజీ కౌన్సిలర్ అమర బిందు వందలాది పేద కుటుంబాలకు ఆరు కిలోల కూరగాయలతో పాటు సబ్బు, మాస్కులు ఉచితంగా అందించారు. పట్టణానికి చెందిన స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు 10 కిలోల సన్న బియ్యంతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ సీఐ సురేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.

శానిటైజర్లు అందించిన మాజీ సైనికులు
చిత్తూరు జిల్లా పుంగనూరులో కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొంటున్న పురపాలక కార్మికులకు, పోలీసులకు స్థానిక సాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందించారు. ఈనెల 14 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా సంస్ధ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పురపాలక కమిషనర్ లోకేశ్వరవర్మ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కార్మికులకు సానిటైజర్లు, మాస్కలు అందించారు.

Ex-servicemen provided by sanitizers
శానిటైజర్లు అందించిన మాజీ సైనికులు

లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు అన్నదానం
లాక్​డౌన్​ కారణంగా విశాఖ జిల్లా అరకు లోయలో పేదల ఆకలి తీర్చేందుకు పలువురు దాతలు తమ వంతు సహాయంగా అన్నదానం చేశారు. అరకు లోయ గిరిజన సంఘంతో పాటు స్థానిక యువత వివిధ సంక్షేమ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పేదలకు భోజనం అందిస్తున్నారు. మరికొంతమంది రాత్రి సమయంలో ఇంటింటికి వెళ్లి భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు పేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు దాతలు వెల్లడించారు.

food distribution
లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు అన్నదానం

నిరాశ్రయులకు అండగా అన్న క్యాంటీన్లు
లాక్​డౌన్​ కారణంగా నిరాశ్రయులైన వారికి విశాఖ జిల్లా అనకాపల్లిలో అన్న క్యాంటీన్లను వసతి, భోజన సదుపాయలను కల్పిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఉన్న 'అన్న క్యాంటీన్​' భవనంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు ప్రతిరోజు ఉచితంగా సుమారు 500 మందికి భోజనం అందిస్తున్నారు.

నిరాశ్రయులకు అండగా అన్న క్యాంటీన్లు

మాతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం సద్దికూళ్లపల్లెలో మాతమ్మ ఆలయంలో స్థానిక యువత ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా భావించే మాతమ్మ తల్లిని భక్తులు కరోనా నుంచి ప్రజలను కాపాడాలంటూ వేడుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన పేదల కోసం నిత్యావసర వస్తువులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక ఎస్​ఐ సుమన్​ పూజలో పాల్గొన్నారు.

Special pooja at the Matamma temple
మాతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రతి లబ్ధిదారునికి రూ.1000 అందజేత
లాక్​డౌన్​ కారణంగా గిరిజన ప్రజలకు రూ.1000 చొప్పున అందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.16.11 కోట్లు విడుదల చేసిందని ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి బీకే బాలాజీ వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,61,189 కుటుంబాలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి రేపు రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు.

Each beneficiary will receive Rs 1000
ప్రతి లబ్ధిదారునికి రూ.1000 అందజేత

ఇదీ చూడండి:నిరుపేదలకు ఆహారం పంపిణీ చేసిన విశాఖ రైల్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.