ETV Bharat / city

దాతల సహకారం.. అవనిగడ్డ కొవిడ్ సెంటర్​కు 9 ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు - అవనిగడ్డ కొవిడ్ సెంటర్​కు 9 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు తాజా వార్తలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్​కు.. దాతలు 9 ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లను అందించారు. దాతలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

oxygen cylinders donation
oxygen cylinders donation
author img

By

Published : May 9, 2021, 5:56 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​కు.. దాతలు ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లను పంపించారు. నాగాయలంక గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, లిఖిత ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు రూ. 5.63 లక్షల విలువైన 7 కాన్సన్‌ట్రేటర్లు హైదరాబాద్ నుంచి ఆసుపత్రికి పంపించారు. అదే గ్రామానికి చెందిన ఉప్పులూరి లక్ష్మీ కామేశ్వరరావు జ్ఞాపకార్ధం వారి మనుమలు, మనుమరాళ్లు కలసి ఒక కాన్సంట్రేటర్, పులిగడ్డ గ్రామానికి చెందిన దివంగత నేత రాజగోపాలరావు జ్ఞాసపకార్ధం వారి మేనల్లుడు రత్నశేఖర్ మరో కాన్సంట్రేటర్​ను ఆసుపత్రికి అందించారు.

ఇప్పటివకు ఉన్నవి 12 సిలిండర్లే..

ఈ కొవిడ్ సెంట్​లో 50 పడకలు ఉండగా.. వాటిలో 12 బెడ్లుకు మాత్రమే అక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఇప్పుడు దాతల సహకారంతో మరో 9 తొమ్మిది కాన్సం​ట్రేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్​ను అందించిన దాతలకు.. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి చేరుకున్న మరో 3.6 లక్షల కరోనా డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.