రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ యువతి హత్య కేసు నిందితుడు నాగేంద్ర బాబును పోలీసులు రెండో రోజు విచారించారు. విజయవాడ న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన నేపథ్యంలో మొదటి రోజు దిశ పోలీస్ స్టేషన్లో విచారించారు. రెండో రోజు యువతి చదువకున్న భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలకు నిందితుడిని తీసుకెళ్లి విచారించారు. యువతి స్నేహితులను కూడా విచారించినట్లు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నిందితుడిని జైలుకు పంపించారు. మరోవైపు యువతి హత్య కేసులో నిందితుడు నాగేంద్రపై విజయవాడ కోర్టులో దిశ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఇదీచదవండి