రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను అందిస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. డిసెంబర్ 25న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వివిధ జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ:
శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మార్కెట్ యార్డ్లో నందివాడ,తాడివలస,దల్లవలస, బురిడి కంచరం గ్రామాల లబ్ధిదారులకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లా:
కర్నూలు జిల్లాలోని మద్దికెర మండలం పెరవలిలో సోమవారం పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు , పక్కా గృహాలు కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కృష్ణాజిల్లా:
కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, పాతఎడ్లలంక గ్రామంలో 807 మంది లబ్దిదారులకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పట్టాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో మొత్తం 3,30,000 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం7 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎంపీ బాలశౌరి తెలిపారు.
ఇదీ చదవండి