విజయవాడలో ప్రేమోన్మాది దాడి ఘటనలో మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులను దిశ ప్రత్యేకాధికారులు కృత్తికా శుక్లా, దీపికా పాటిల్ పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడుల్లో నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధిత యువతి కేసులో విచారణ వేగవంతం చేశామని...అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల వాస్తవికతను నిర్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీచదవండి