ETV Bharat / city

Disha App: కేసులు ఎక్కువగా నమోదవడం మంచిదే: సీఎం జగన్​ - దిశా యాప్​ ఫిర్యాదులు

దిశా యాప్​ ద్వారా ఫిర్యాదులు పెరిగాయని సీఎం జగన్​ అన్నారు. పోలీసు స్టేషన్​లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇలా కేసులు ఎక్కువ నమోదు కావడం మంచిదేనని అన్నారు. ఎక్కువ కేసులు నమోదు కావడమంటే మన విధిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క అని స్పష్టం చేశారు.

సీఎం జగన్​
సీఎం జగన్​
author img

By

Published : Sep 22, 2021, 10:25 PM IST

పోలీసు స్టేషన్లకు ఎక్కువగా ఫిర్యాదులు రావడం, వాటి మీద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం చాలా మంచిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఐఆర్‌లు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయనే సంశయం పోలీసులకు అవసరం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదు కావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసులు సంఖ్య ఎక్కువగా నమోదు కావడ వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచన సరికాదన్నారు.

దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదులు నమోదుకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఎక్కువ కేసులు నమోదు కావడమంటే మన విధిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క అని అన్నారు. ఫిర్యాదుదారులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వస్తున్నట్టేనన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు వ్యవస్థపై సీఎం సమీక్ష జరిపారు.

కేరళలో ఏడాదికి 7 లక్షలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయని గుర్తు చేశారు. మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు.. ఫిర్యాదుదారులు ముందుకు రాగలుగుతారని తెలిపారు. అలాంటి సందర్భాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయన్నారు.

ప్రతి మహిళ తన ఫోన్​లో దిశయాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం లక్ష్యం కావాలని, దీన్ని సవాలుగా తీసుకోవాలన్నారు. ఇప్పటికి దిశయాప్‌ను 70 లక్షల మంది డౌన్​లోడ్​ చేసుకోవడం చాలా మంచి పరిణామమన్నారు.

దేశంలో మహిళల మీద నేరాల్లో 91శాతం కేసుల్లో కేవలం 2 నెలల వ్యవధిలోనే ఛార్జిషీటు దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. దిశ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల భద్రతలో సమగ్రమైన మార్పు తీసుకురాబోతుందని, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ రూపుదిద్దుకోనుందన్నారు. ఫోన్‌ను షేక్‌చేస్తే చాలు.. 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా యాప్​ను తీర్చిదిద్దామన్నారు.

ఇదీ చదవండి: లండన్​కు ఏపీ అధికారుల బృందం.. రస్ అల్ ఖైమా సంస్థతో చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.