Property tax: పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికిందా? ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. వడ్డీపై రాయితీ ఇక ఉండదని... పన్ను బకాయిలు మొత్తం నెలాఖరులోగా చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివర్లో ఏటా వడ్డీపై రాయితీ ప్రకటించడం అనేక ఏళ్లుగా రివాజుగా వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పన్నులపై వడ్డీ రాయితీ ప్రకటించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2019లో మేలో ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందున్న ప్రభుత్వం 2019 మార్చిలోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది. కొవిడ్ కారణంగా ప్రజలు గత రెండేళ్లుగా సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించని కారణంగా వడ్డీ భారీగా పెరిగింది. విజయవాడలోని పటమటకు చెందిన ఒకరు ఏడాదికి రూ.4వేల చొప్పున తన ఫ్లాట్‌కు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. వ్యాపారం దెబ్బతినడం, కొవిడ్ తదితర కారణాలతో వరుసగా నాలుగేళ్లుగా పన్ను చెల్లించనందుకు 4 ఏళ్ల పన్నుపై వడ్డీ కింద రూ.5,400 విధించారు. నగరపాలక సంస్థ తాజాగా జారీ చేసిన ప్రత్యేక నోటీసు ప్రకారం ఆయన అసలు, వడ్డీ, పెరిగిన పన్నుతో కలిపి రూ.15వేలకుపైగా చెల్లించాల్సి వస్తోంది.
ఇదీ చదవండి:
అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న రాష్ట్రం... రుణ భారం 7.76 లక్షల కోట్లు?