rgv to meet minister perni nani: మంత్రి పేర్ని నానితో.. దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గం.కు సచివాలయంలో సమావేశం కానున్న ఆర్జీవీ.. సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించనున్నారు. సినిమా టికెట్ ధరలపై ఇటీవల పేర్ని నాని, ఆర్జీవీ మధ్య ఇటీవల ట్వీట్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ సమస్యలు వివరించడానికి మంత్రి అపాయింట్‌మెంట్ కోరారు వర్మ. దీనికి స్పందించిన మంత్రి.. త్వరలోనే కలుస్తానని చెప్పారు. ఈ మేరకు రేపు వీరిద్దరూ భేటీకానున్నారు.
సంబంధిత కథనాలు: