ETV Bharat / city

బల్దియా బరిలో డిజిటల్‌ సమరం!

author img

By

Published : Nov 20, 2020, 9:11 AM IST

చూస్తే ఒక చిత్రమే. చదివితే ఒక వాక్యమే. వాటి వెనుక ఎన్నో భావాలు. ఇంకెన్నో ప్రశ్నలు. మరెన్నో వెటకారాలు..ఎత్తిపొడుపులు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే మొదలైన ప్రచార పర్వానికి ఆనవాళ్లివి. సదరు సందేశాల్లో కొన్ని ఐదేళ్ల పదవీ కాలంలో నేతలు చేసిన పొరపాట్లు.. లోపాలను ఓటర్లకు తెలియజేస్తుండగా..మరికొన్ని లేనిపోని అభాండాలు..అపోహలను ప్రచారం చేసేలా ఉన్నాయి. అందులో ఏది నిజమో..ఏది అబద్ధమో తేల్చుకోవాల్సింది మాత్రం విజ్ఞులైన ఓటర్లే సుమా!

బల్దియా బరిలో డిజిటల్‌ సమరం!
బల్దియా బరిలో డిజిటల్‌ సమరం!

‘ఒక్క రోజుతో పోయేది కాదు.. చేయిచేయి కలిపి పైలంగా అడుగెయ్యాలె’

‘నేటి నీ నిర్ణయం....రేపటి తరానికి దారి చూపుతుంది’

‘కలల్లోనే ఉండిపోతావా...ఎన్నడు మేల్కొంటావు! ఓటేసే ముందు కాస్త ఆలోచించు!

చేసిన మంచి పనులు చెప్పుకోవాలన్నా..చేయనివి చేసినట్టుగా ప్రచారం చేసుకోవాలన్నా..ప్రత్యర్థిపై దుమ్మెత్తి పోయాలన్నా సామాజిక మాధ్యమాలను మించిన వేదిక ఇంకొకటి ఉండదనే నమ్మకం రాజకీయ నాయకుల్లో పెరిగింది. అందుకేనేమో! ప్రత్యర్థులను చిత్తు చేయడమే లక్ష్యంగా అభ్యర్థులు, వారి అనుచరులు ‘సంక్షిప్త సందేశాలు-చిత్రాలు, దృశ్యాలను’ సామాజిక మాధ్యమాలే వేదికగా ఓటర్లపైకి ఎక్కుపెడుతున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగిందో లేదో కాలనీలు, బస్తీల్లో వేలాదిగా సామాజిక మాధ్యమ గ్రూపులు రాత్రికిరాత్రే పుట్టుకొచ్చాయి. యూట్యూబ్‌ ఛానళ్లు, ఫేస్‌బుక్‌ పేజీలూ సిద్ధమవుతున్నాయి. రెండు నిమిషాలకో చిత్రం, ఐదు నిమిషాలకో వీడియో సందేశం...ఇలా పనిగట్టుకుని పోస్టులు పెడుతూ ఎన్నికల రంగస్థలాన్ని రక్తికట్టించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మరోవైపు వివాదాస్పద అంశాలను ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ నిఘా మొదలైంది. నగరంలో వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యత ఖాతాలు లేనివారు ఉండరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తమ వాణిని వినిపించేందుకు ‘ఇవి దగ్గరి దారులని’ నాయకులు భావిస్తున్నారు. సమయం తక్కువగా ఉండటం, ప్రతి ఓటరును కలిసి ప్రచారం చేసే అవకాశం లేకపోవడం, వ్యక్తిగత దూరం పాటించాల్సి రావడం వంటి కారణాలతో ఈ ప్రచారం తమకు కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వీటిపైనే ఆధారపడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న నమ్మకం ఉన్న వారు తమ కార్యకర్తల్లో ఒక్కొక్కర్ని 15 గ్రూపుల్లో సభ్యులుగా ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్కో డివిజన్‌ పరిధిలో ఎంత లేదన్నా 20 వేల ఫోన్‌ నంబర్లను సేకరించుకుని ప్రచారానికి తెరతీస్తున్నారు. నగరానికి తూర్పున ఉన్న ఒక డివిజన్‌కు చెందిన నాయకుడు ఒకరు ఏకంగా 22 ఫేస్‌బుక్‌ పేజీలను సిద్ధం చేయించుకున్నారు. తమ ప్రాంతంలోని కాలనీలు, బస్తీల్లోని వారి ఖాతాలను అనుసంధానించుకుని ప్రచారానికి సిద్ధమయ్యారు. కూకట్‌పల్లికి చెందిన ఓ నాయకుడు తమ సన్నిహితులతో యూట్యూబ్‌ ఛానళ్లను ఏర్పాటు చేయించి, అందరూ చూసేలా దాని లింకులను వాట్సప్‌ గ్రూపులకు చేరవేస్తున్నారు. సోషల్‌ మీడియా గ్రూపుల ఏర్పాటు, నిర్వహణకు అనుగుణంగా ప్రత్యేకంగా కార్యాలయాలు తెరుస్తున్న వారూ ఉన్నారు. కూకట్‌పల్లి, లక్డీకాపూల్‌, పటాన్‌చెరు, జీడిమెట్ల, నారాయణగూడ, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోలు, చైతన్యపురి ప్రాంతాల్లో సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

ఈ ప్రచారం ఖర్చూ అభ్యర్థి ఖాతాలోకే: ఎస్‌ఈసీ
సామాజిక మాధ్యమ ప్రచారం ఎన్నికల నియమావళి పరిధిలోకే వస్తుంది. దాని ప్రకారం ఈ ప్రచారం కోసం అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల వ్యయం కిందనే పరిగణిస్తాం. అభ్యర్థులు, పార్టీల ఖాతాల్లోనే ఈ ఖర్చునూ చూపుతాం.

రంగంలోకి సోషల్‌ వారియర్స్‌... వార్‌ రూమ్స్‌

పార్టీల వారీగా ఇప్పటికే సోషల్‌ మీడియా విభాగాలు ఉన్నాయి. తెరాస, కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యేకంగా పార్టీ సోషల్‌ మీడియా విభాగాలు పనిచేస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా నిపుణులు ఉన్నారు. ఇవిగాక పలువురు అభ్యర్థులు ప్రత్యేకంగా ఐదు నుంచి పది మంది యువకులతో వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని కోసం ప్రత్యర్థుల లోపాలను వెలుగులోకి తెచ్చే, వారి ప్రచారాన్ని తిప్పికొట్టే సమర్థత ఉన్న యువతను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్కో బృందానికి రూ.లక్షల్లోనే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. నాయకులు గతంలో మాట్లాడిన వీడియో సందేశాలు, ఫొటోలు, వ్యాఖ్యలను సేకరించి, వాటిని ఎండగట్టేలా తాజా వివరాలను జోడించి గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టడం వీరి పని.

ఇదీ చదవండి: నేటితో ముగియనున్న జీహెచ్​ఎంసీ నామినేషన్లు పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.