గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుకున్న హెరాయిన్(heroin seized)కు ఏపీతో సంబంధం లేదని డీజీపీ గౌతం సవాంగ్(DGP Gautam Sawang) తెలిపారు. విజయవాడ(vijayawada) చిరునామాను మాత్రమే వాడుకున్నారని అన్నారు. ఈ ఘటనపై డీఆర్‌ఐ నార్కోటిక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారని తెలిపారు.
హెరాయిన్ ఘటనలో చెన్నై కేంద్రంగా మొత్తం లావాదేవీలు జరిగాయని డీజీపీ తెలిపారు. సీఎం ఆఫీసు దగ్గరే జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తద్వారా ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావంలోకి నెడుతున్నారని అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. దర్యాప్తు బృందాలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
drugs case : హెరాయిన్ కేసులో రంగంలోకి ఈడీ..!
CHANDRABABU : 'గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్..సీఎం ఇంటి సమీపంలోని సంస్థదే'