Rush at Medaram Jatara: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలామంది తాము మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు.
Medaram Jatara Rush: కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మేడారంలో దుకాణాలను మూసివేశారు. బెల్లం, మంచినీళ్లు, పసుపు, కుంకుమ వంటి అత్యవసరమైన వస్తువులు మాత్రమే విక్రయిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులంతా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులంతా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Medaram Jatara News: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం బస్టాండ్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గిరిజన అమ్మవార్లను సజ్జనార్ దర్శించుకున్నారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించిన ఆయన.. దుకాణాలను తనిఖీ చేశారు. బస్సు సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.మారుమూల గ్రామాలకు మరిన్ని బస్సు సౌకర్యాలను కల్పిస్తామని సజ్జనార్ తెలిపారు.
ఇదీ చదవండి :