మాజీమంత్రి దేవినేని నెహ్రూ 4వ వర్ధంతి సందర్భంగా.. వైకాపా తూర్పు ఇన్ఛార్జ్, నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ నివాళులు అర్పించారు. నెహ్రూ ఘాట్ వద్ద అవినాశ్ తో కలిసి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు, వైకాపా నగర అధ్యక్షులు బొప్పాన భావకుమార్, అభిమానులు నివాళులు అర్పించారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పేద ప్రజల కోసం ఎంతో సేవ చేసిన ఘనత దేవినేని నెహ్రూ సొంతమని వారు కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, నమ్మినవారికి అండగా నిలవడం నెహ్రూ నైజమని తనయుడు.. వైకాపా నాయకుడు దేవినేని అవినాశ్ గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: