ETV Bharat / city

'ఏడాది పాలన రంగులు వేయడానికి, మార్చడానికే సరిపోయింది' - 'ఏడాది పాలన రంగులు వేయడానికి, మార్చడానికే సరిపోయింది'

ఏడాది ప్రభుత్వ పాలన కార్యాలయాలకు రంగులు వేయడానికి, మార్చడానికే సరిపోయిందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. రాష్ట్ర సరిహద్దుల్లో వైకాపా నాయకులు మద్యాన్ని అమ్ముకుని కాసులు సంపాదిస్తుంటే జైళ్లలో పెట్టే ధైర్యం లేదని ఆక్షేపించారు.

'ఏడాది పాలన రంగులు వేయడానికి, మార్చడానికే సరిపోయింది'

author img

By

Published : Jun 30, 2020, 9:57 PM IST

ఏడాది ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలకు రంగులు వేయడానికి, మార్చడానికే సరిపోయిందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. న్యాయస్థానం మొట్టికాయలు వేసే వరకు రంగులు మార్చడానికి చలనం రాలేదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో పూరగుట్ట వద్ద పేదవాళ్లకు ఇచ్చిన రెండు సెంట్ల స్థలాన్ని సెంటున్నరకు తగ్గించాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. పేదవాడి ఆగ్రహానికి గురి కావద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తామన్నారు.

జర్నలిస్టు గంటా నవీన్ హత్యకేసులో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, వైకాపా నాయకుడు, వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుడు బయటకొచ్చారన్నారు. అంతటి ధైర్యం అతనికెలావచ్చిందని, వెనకున్నదెవరని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే దోషులెంతటి వారైనా సరే విచారణ జరిపించి బయటకు లాగుతామని హెచ్చరించారు. ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో వైకాపా నాయకులు మద్యాన్ని అమ్ముకుని కాసులు సంపాదిస్తుంటే జైళ్లలో పెట్టే ధైర్యం లేదని ఆక్షేపించారు. తమ అహంకారపూరిత ధోరణికి సమాధానం చెప్పే అవకాశం తెలుగు దేశం పార్టీకి ప్రజలు ఇస్తారని వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.