ఏడాది వైకాపా పాలనలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచిందని వైకాపా నేత దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ పాలన కొనసాగటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంట సిరులు పండించేలా పథకాన్ని రూపొందించారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతం అయ్యారని ప్రశంసించారు.