Deputy CM's: వైకాపా ప్రభుత్వం తొలి మంత్రిమండలిలో మాదిరిగానే ఈ దఫా కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రి పదవులను కొనసాగించే అవకాశం ఉన్నట్లు.. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. తొలి కేబినెట్‌లో ఎస్సీ, మైనారిటీ విభాగంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసిన నారాయణస్వామి, అంజద్‌బాషాలను ప్రస్తుత మంత్రిమండలిలోనూ తీసుకున్నారు. వారిద్దరూ తిరిగి ఉపముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగవచ్చని అంటున్నారు. ఎస్టీ కోటాలో రాజన్నదొరకు అవకాశం దక్కనుంది. బీసీకి సంబంధించి గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ పదవి కోల్పోగా, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కింది. ఆయనకు ఈ పదవి దక్కవచ్చన్న చర్చ విన్పిస్తోంది. కాపు కోటాలో గత కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నానిని పదవి నుంచి తప్పించారు. ఆ సామాజికవర్గం నుంచి మంత్రులు కాబోతున్న అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌లలో ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందన్నది ఆసక్తి రేపుతోంది. అమర్‌నాథ్ లేదా రాంబాబు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: