2021 - 22 ఆర్ధిక సంవత్సరంలో 5 వేల మంది ఇమామ్లు, మౌజన్లకు పెంచిన గౌరవ వేతనాన్ని మే, జూన్ నెలలకు 14 కోట్ల రూపాయలను చెల్లించామని ఉపముఖ్యమంత్రి (మైనారిటీ సంక్షేమం) అంజాద్ బాషా వెల్లడించారు.
మసీదు కమిటీల జాయింట్ ఖాతాల్లో ఈ గౌరవ వేతనాన్ని జమ చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని 7.38 కోట్ల రూపాయలు త్వరలోనే మసీదు కమిటీల ఖాతాల్లో జమ అవుతాయని ఆయన ప్రకటించారు. ఎలాంటి జాప్యమూ లేకుండా మసీదు కమిటీలు ఇమామ్, మౌజన్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:
LOANS: రాష్ట్రానికి ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం ఎంతంటే..!