ఇవీ చూడండి.
ఎవరి కోసం మోహన్‌బాబు వైకాపాలో చేరారు: దాసరి సుశీల - దాసరి నారాయణ రావు
'నాలుగేళ్ల తర్వాత పసుపు-కుంకుమ ఎందుకు ఇచ్చారు అని మోహన్ బాబు అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంగతి ఆయనకు తెలియదా? కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత చంద్రబాబుది. ఎవరి ప్రయోజనాల కోసం వైకాపాలో చేరారో మోహన్ బాబు చెప్పాలి' -దాసరి సుశీల, దాసరి నారాయణ రావు కోడలు
దాసరి సుశీల
సినీ నటుడు మోహన్ బాబుపై దాసరి నారాయణరావు కోడలు సుశీల మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత పసుపు-కుంకుమ ఎందుకు ఇచ్చారు అన్న వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంగతి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కష్టకాలంలోనూ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. చంద్రబాబు ప్రజల అభివృద్ధి కోసం ఎన్నికల్లో దిగారని... మరిమోహన్ బాబు ఎవరి సంక్షేమం కోసం వైకాపాలో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైటెక్ సిటీలా మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని సుశీల అన్నారు.
ఇవీ చూడండి.
sample description