ETV Bharat / city

తెలంగాణ: వైద్యుడి డేటింగ్ యాప్ చాట్ కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్! - తెలంగాణ వార్తలు

డేటింగ్ యాప్‌ వేధింపుల కేసులో సైబర్ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఓ యువతితో చాటింగ్ చేసి మోసపోయానని డాక్టర్ రమేశ్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డేటింగ్ యాప్ చాట్ కేసులో ఇద్దరు అరెస్ట్
డేటింగ్ యాప్ చాట్ కేసులో ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Mar 27, 2021, 7:56 PM IST

డేటింగ్ యాప్‌లో యువతులతో చాటింగ్ చేసి మోసపోయిన డాక్టర్ రమేశ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఉత్తర్​ప్రదేశ్ నోయిడాకు చెందిన చౌదరి, ఉమేశ్ యాదవులను రిమాండ్‌కు తరలించారు.

ఏం జరిగిందంటే..?

ఆరు నెలల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతితో కొంతకాలం వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారు 60 ఏళ్ల డాక్టర్ రమేశ్. తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఓ రోజు ఆ అమ్మాయి ఈ వైద్యుడిని ప్రేమిస్తున్నానంటూ వల విసిరింది. ఇద్దరూ కలిసి ‘న్యూడ్‌ వీడియో(నగ్నంగా)’ కాల్స్‌ చేసుకున్నారు. ఈ బాగోతాన్ని ఆ మాయలేడీ రికార్డ్‌ చేసింది. కోరినంత డబ్బులివ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించింది. దీంతో ఆ వైద్యుడు 2020 నవంబరులో దఫదఫాలుగా ఆమెకు రూ.39 లక్షల వరకు సమర్పించుకున్నారు.

అయినా తీరు మార్చుకోకుండా డేటింగ్‌ యాప్‌ల్లో ఇతర అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు ముట్టజెప్పాడని పోలీసులకు వివరించారు. మొత్తం రూ.70లక్షల దాకా సమర్పించుకున్నారు. అయినప్పటికీ డిమాండ్‌ పెరుగుతుండటంతో తట్టుకోలేక చివరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి నోయిడాలో ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చదవండి:

గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.