రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి రావడంతో కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలలో మినహా మిగతా జిల్లాల్లో గురువారం నుంచి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సర్కార్ వెల్లడించింది.
ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు నియంత్రణలోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీచదవండి.
ఇదీ చదవండి: Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు