క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చార్మినార్, జూ పార్కు, పురాణాపూల్, మోహిదీపట్నం, లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్‌లో వాన పడుతోంది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, హిమాయత్‌నగర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్‌పేట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, మలక్‌పేట్, కొత్తపేటలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
జిల్లాల్లో కూడా..
క్యూములోనింబస్ మేఘాలతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రానికి మరిన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఉధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని స్పష్టం చేసింది. తెలంగాణపై తుఫాన్ ప్రభావం లేదని తేల్చిచెప్పింది.
ఇవీ చూడండి: విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు