ETV Bharat / city

CS review: స్పందనలో ఫిర్యాదులపై.. అధికారులతో సీఎస్ సమీక్ష - cs adithyanath das latest updates

స్పందన (spandana) కార్యక్రమంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన ద్వారా 2 లక్షల 3 వేల 528 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు సీఎస్​కు వివరించారు. ఇందులో 1 లక్షా 44 వేల 351 ఫిర్యాదులను పరిష్కరించినట్టు స్పష్టం చేశారు.

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
author img

By

Published : Jul 12, 2021, 7:06 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్పందన కార్యక్రమం ద్వారా అందే ఫిర్యాదులపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. నెల వారీగా అందిన ఫిర్యాదులు, ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్న అంశంపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన ద్వారా 2 లక్షల 3 వేల 528 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు సీఎస్​కు వివరించారు.

ఇందులో 1 లక్షా 44 వేల 351 ఫిర్యాదులను పరిష్కరించినట్టు స్పష్టం చేశారు. మరో 41 వేల 493 ఫిర్యాదల అభ్యర్థనలపై సత్వరం నిర్ణయం తీసుకుని ప్రజలకు సాంత్వన కలిగించాలని సీఎస్.. అధికారులను ఆదేశించారు. 20 శాతం మేర ఫిర్యాదులు, అభ్యర్థనలు పరిష్కారంలో ఎంత సమయం పడుతుందన్న అంశాన్ని కూడా బాధితులకు తెలియచేయాలని సీఎస్ సూచించారు.

ఇదీ చదవండి:

KATHI MAHESH: కత్తి మహేష్​ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.