అంతర్రాష్ట్ర సంబంధాలు, సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, విభజన హామీల అమలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం మార్చి నాలుగో తేదీన జరగనుంది.
ఏపీకి సంబంధించి 41 అజెండా అంశాల్లో 20కి పైగా రాష్ట్రం నుంచి మరో 20 అంశాలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్దేశించనుంది. మరోవైపు తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత, బస ఏర్పాట్లపై సీఎస్ మరోమారు ఆరా తీశారు.
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం: 'విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వం'