అంతర్వేదిలో రథం దగ్ధమయినపుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉండుంటే నేడు దేవాలయాలపై దాడులు జరిగేవి కావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పజెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం వల్లే ఇవాళ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. దాడులను అరికట్టి, దోషులను శిక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
పరువు హత్యల నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పున్నయ్య కమిషన్ సూచనలతో పకడ్బందీగా అమలు చేయాలని మధు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి