రాష్ట్రంలోని కరోనా రోగులకు కనీస వైద్య సదుపాయం అందడం లేదని.. ప్రభుత్వం వెంటనే అన్ని రాజకీయ పక్షాలను పిలిచి అభిప్రాయాలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కొవిడ్ నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరైనదికాదని అన్నారు. వైద్యుడి పట్ల గుంటూరు కలెక్టర్ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.
రాజధాని భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్‌పై విచారణ జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అమరావతిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినా.. విచారించి దోషులను శిక్షించాలన్నారు.
ఇదీ చదవండి: విశాఖ గూఢచర్యం కేసులో ఇమ్రాన్ గితేలీ అరెస్టు