ETV Bharat / city

‘అంగన్వాడీ, ఆశా కార్మికులకు రూ. 50 లక్షల బీమా కల్పించాలి’

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం రూ.50 లక్షల బీమా ఇవ్వాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్​ చేశారు. వివిధ పథకాల అమలు కోసం పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించరంటూ ఆయన ప్రశ్నించారు.

cpm baburao comments on anganwadi workers protest at vijayawada
సీపీఎం నేత బాబురావు
author img

By

Published : Aug 8, 2020, 12:11 AM IST

విజయవాడలో అంగన్వాడీ కార్మికుల నిరసనకు సీపీఎం నేత బాబురావు మద్దతు తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపించిందని ఆయన అన్నారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించరంటూ ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న వర్కర్లు ఎదురు పెట్టుబడితో కేంద్రాలను నడపాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ, ఆశా కార్మికులకు రూ. 50 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

వేతనాలు చెల్లించకుండా బకాయిలు పెట్టడం సంక్షేమమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.