CPI Ramakrishna on Students arrest: విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల నేతల అరెస్టును... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. అక్రమాలకు పాల్పడిన రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావును రీకాల్ చేయాలని కోరితే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. వీసీ ఆనంద్‌రావుని రీకాల్ చేసి 153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని కోరారు. 13 మంది విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. పరీక్షా విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :