CPI Ramakrishna on YCP Govt. : దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడలో మేధోమథన సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ... కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సామాజిక న్యాయాన్ని విస్మరించారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అమలు చేయకుండా సొంత స్కీంల పేరుతో ఆ నిధుల్ని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. దళిత వర్గాలు కమ్యూనిస్టులతో కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.రెండు రోజులపాటు జరిగే సదస్సులో దళిత హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు.
నిత్యావరాలపై ధరలను నియంత్రించాల్సింది పోయి...
ప్రజలకు అవసరమైన నిత్యావరాలు ధరలను అదుపు చేయాల్సింది పోయి.. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించిందని రామకృష్ణ అన్నారు. పక్క రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించడం లేదన్నారు. గతంలో ధరలపై పదే ,పదే మాట్లాడిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యులపై విపరీతమైన భారాలు మోపుతున్నారన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి మానుకుని సినిమా పంపిణీదారులతో చర్చించి అందరికి అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి : Man committed suicide : అతని వేధింపుల వల్లే..ఆత్మహత్య చేసుకున్నాడు...